ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /మండల కేంద్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి, ఎంపీడీవో కుమార్, సర్పంచ్ పోలెబోయిన సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు వివిధ పార్టీల నాయకుల పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram