నాలా ఎవరు మోసపోకూడదు

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ /ఆడపిల్లలు ప్రేమ పేరుతో  ఎవరు మోసపోకూడదు. ప్రేమిస్తున్నానని చెప్పి దగ్గరై.. ఆ వివాహం చేసుకొని  చిత్ర హింసలకు పాల్పడిన వ్యక్తి నవాజ్ పై కఠిన చర్యలు తీసుకొని, శిక్షించాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

 

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం. నవాజ్ అనే వ్యక్తి గత సంవత్సరం కూకట్ పల్లిలో పరిచమై  కలిసి వ్యాపారం చేద్దామంటూ ఆఫర్ చేశారని, ఆ తర్వాత  ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడన్నారు ఇరువురి మధ్య మతపరమైన ఇబ్బందులు రాకుండా తానే మతం మార్చుకుంటానని చెప్పుకొచ్చాడని, అంతేకాకుండా నవదుర్గగా పేరు మార్చుకున్నట్లు సర్టిఫికేట్ ని సైతం తనకు చూపించాడన్నారు.

 

అతని మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నానని, మొదటి సారి బేగంపేటలో అతను అద్దె తీసుకున్న గదికి తీసుకుపోయాడని, అక్కడే తనకు మత్తు మందు ఇచ్చి అతని సోదరుడు, స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడని వాపోయారు. అతనితో ఒకసారి బెంగళూరుకు వెళ్లానని , అక్కడ అతని రెండు వివాహాల బాగోతం బయటపడిందని, దీంతో అక్కడికి పోలీసులకు ఫిర్యాదు చేశానని, అప్పుడు తానే రెండు వివాహాలు జరిగాయని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడని తెలిపారు.

 

ఎవరికైనా ఫోన్ చేయాలంటే తన ఫోన్ తోనే మాట్లాడించే వాడని, తన బ్యాంకు అకౌంట్లను తానే నడిపించేవాడని, శంషాబాద్ లో ఉన్న తమ భూమిని అమ్ముకున్నాడని, డబ్బులు సైతం ఇవ్వలేదన్నారు.

 

నవాజ్ కి గంజాయి, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, అతనితో పాటు అతని సోదరులు, స్నేహితులు వాటిని తీసుకునే వారన్నారు. తనను దుబాయి తీసుకెళ్తానని చెప్పాడని, దీంతో అతని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని, హైదరాబాద్ లోని ఇంటి వద్ద పాస్ పోర్టు తెచ్చుకుంటానని చెప్పి తప్పించుకున్నా అని తెలిపారు

 

తనతో పాటు మరికొంత మంది జీవితాలను సైతం నవాజ్ నాశనం చేశాడని, ఆడపిల్లలు ప్రేమ వ్యవహారంలో  జాగ్రత్త ఉండాలని, ఇలాంటి వారి భారిన పడుకుండా ఉండేందుకు తాను బయటకు వచ్చి ఈ నిజాలు చెబుతున్నానని స్పష్టం చేశారు. తన లాగా మరే ఆడపిల్లకు అన్యాయం జరుగవద్దని ఆవేదన వ్యక్తం చేశారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram