జిల్లా కలెక్టర్ అంకిత్ కి ఐటీడీఏ పిఓ బి.రాహుల్ కి వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / మణుగూరు మండలం కూనవరం పంచాయతీ పరిధిలోని రేగుల గండి చెరువు వద్ద ప్రమాదాల నివారణకు చుట్టూ ఇనుప కంచే నిర్మించాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పాఠశాలలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ మణుగూరుకు చెందిన సామాజిక సేవకులు కర్నే బాబురావు జిల్లా కలెక్టర్ అంకిత్ కి ఐ టి డి ఏ పి ఓ బి. రాహుల్ కి మంగళవారం వినతి పత్రాలు అందజేసినట్లు విలేకరులకు తెలిపారు, గత మూడు రోజుల క్రితం రేగుల గండి చెరువులో ప్రమాదవశాత్తు చనిపోయిన విద్యార్థి నక్క హర్షవర్ధన్ మృతి కన్నవారికి గర్భశోకాని మిగిల్చిందని ఈ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని తన వంతు కర్తవ్యంగా సమస్యను అధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళినట్లు ఆయన తెలిపారు హర్షవర్ధన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.








