కవిత కొత్త పార్టీ పేరు ఇదే ..
తెలంగాణ రాష్ట్ర సేన..
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / తెలంగాణ లో కొత్త పార్టీ ఆవిర్భవించింది.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని ఆధ్వరా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీకి “తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)” అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు.సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ వేదికగా పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా నాయకులు పార్టీకి మద్దతు ప్రకటిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా పార్టీ పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు.








