మరణించినట్టు ఆధారాలు కావాలి అని బ్యాంకువారు అడిగితే – ఏకంగా శవాన్ని తీసుకొని వెళ్లాడు

మరణించినట్టు ఆధారాలు కావాలి అని బ్యాంకువారు అడిగారు – ఏకంగా శవాన్ని త్రోవ్వి తీసుకొని వెళ్లాడు

 

 

 

ప్రభుత్వ నియమాలు ఈ వ్యవస్థ తీరుతెన్నులు తెలియని అమాయకుడు ఒడిశాలోని కియోంజర్ జిలా డియానాలీ గ్రామానికి చెందిన జితు ముండా (50) అనే గిరిజన వ్యక్తి

 

 

తన సోదరి క‌ల్రా ముండా గత జనవరి లో ఆనారోగ్యం తో మరణించింది అయితే ఆమె పేరున ఒడిశా గ్రామీణ బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు 20,000 నగదు ను తీసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

 

కానీ అలా ఇవ్వడానికి కి బాంకు రూల్సు ఒప్పుకోవు అని బ్యాంకు అధికారులు తిరస్కరించారు

 

జితు ముండా పదే పదే ప్రయత్నం చేయడంతో ఆమె చనిపోయినట్టు అధారాలు తీసుకొనిరా అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడం వీలు అవుతుంది అని సమాధానం చెప్పారు

 

సొదరి మరణించినట్టు ఆధారాలు అంటే Death & Legal Heir Certificate ల వ్యవహారం తెలియని ఆ గిరిజన అమాయకుడు 27April 2026 సోమవారణ నాడు ఏకంగా తన సోదరి క‌ల్రా ముండా పాతిపెట్టిన శవాన్ని త్రోవ్వి తీసుకుని బ్యాంకు వెళ్లాడు

 

ఈ విడియో వైరల్‍ అవ్వడం తో ప్రభుత్వం – బ్యాంకు తీరు పై చాలా విమర్శలు వచ్చాయి

 

అనుమతి లేకుండా శవాన్ని తీసినందుకు జితు ముండా పై కేసు నమోదుకు ప్రయత్నాలు కూడా జరిగాయి అయితే పోలీసు ఉన్నతాధికారుల జోక్యం తో కేసు నమోదు చేయకుండా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జితూ ముండా కు Death & Legal Heir \Certificate ఇప్పించే ఏర్పాట్లు చేసారు

 

 

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram