గోల్డెన్ న్యూస్/ ధర్మవరం/ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్లో ప్రధాన రహదారి పక్కన ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంను ఎత్తుకెళ్లారు.
తెల్లవారుజామున బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు దొంగలు మాస్కులు ధరించి ఏటీఎంలోకి చొరబడ్డారు.
రాడ్లతో దానిని పెకిలించడానికి ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో తాళ్లు కట్టి బొలెరో వాహనంతో గట్టిగా లాగారు. ఎటీఎంను వాహనంలోకి ఎక్కించి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు వాహనంలో బత్తలపల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆ మార్గంలో తనిఖీలు చేపట్టారు.
Post Views: 34








