ఒప్పో.. రియల్ మీ.. వన్ ప్లస్..మీ ఫోన్లు ఒరిజినలేనా.. ?
ఒప్పో.. రియల్ మీ.. వన్ ప్లస్ ఫోన్లు వాడుతున్నారా.. అయితే ఈ న్యూస్ మీకోసమే.. మీరు వాడే ఫోన్ డూప్లికేట్ కావచ్చు.. అవునండీ నిజమే.. ఎందుకంటే మన దేశంలో ఇలా కాపీ చేసిన ఫోన్లు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఈ ఫేక్ ఫోన్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఏకంగా మూడు కంపెనీలకు చెందిన మొబైల్స్, యాక్ససరీస్ అన్నిటినీ.. మోతీ నగర్లో ఫ్యాక్టరీ పెట్టిమరీ తయారు చేస్తున్నారు. 8 మెషీన్లు.. ఒక ప్రింటింగ్ మెషిన్.. తో ఈ దందా చాలాకాలంగా సైలెంట్ గా నడిపిస్తున్నారు. దేశంలో చాలా ప్రాంతాలకు ఈ మొబైల్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.
Post Views: 543








