అన్నకు తలకొరివి పెట్టిన చెల్లి

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ల బొమ్మూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరకగూడెం మండలానికి చెందిన మనోహర్ (19) మృతి చెందితే చెల్లి దహన సంస్కారాలు నిర్వహించిన హృదయ విదారక సంఘటన సోమవారం కరకగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆడెపు సతీష్ అతను భార్య , కొడుకుతో కలిసి భద్రాచలం ఆస్పత్రికి వెళుతుండగా ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది, ఈ ప్రమాదంలో గాయపడిన సతీష్ , సతీష్ భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనోహర్ మృతి చెందాడు, కుటుంబ పెద్దలు లేకపోవడంతో చెల్లెలు మాధురి, అన్నకు తల కొరివి పెట్టింది. ఈ హృదయ విదారక సంఘటనను చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram