తడి పొడి..ఇప్పటినుంచి నాలుగుకు ముడి

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ /పంచాయతీలు,పురపాలికల్లో ఘన వ్యర్థాలను 4 రకాలుగా విభజించి సేకరించనున్నారు.ఇన్ని రోజులు తడి,పొడి చెత్తను వేర్వేరుగా పారిశుద్ధ్య సిబ్బంది తీసుకుంటున్నారు.సుప్రీంకోర్టు మార్గ దర్శకాలతో అన్ని మున్సిపాలిటీలు,గ్రామ పంచాయతీల్లో చెత్తను నాలుగు రకాలుగా చేసి సేకరణ చేపట్టాలని ప్రభుత్వం ఈ మధ్య ఆదేశాలు జారీ చేసింది.ఇందులో మొదటిది తడి వ్యర్ధాలు,రెండోది పొడివి,మూడు శానిటరీ వ్యర్థాలు.. వీటిని ప్రత్యే కంగా సేకరించనున్నారు.చివరగా ప్రత్యేక జాగ్రత్త,హాని కల్గించేవి.

 

ఇకపై ఇవే నిబంధనలు..

 

వాడిన డైపర్లు,శానిటరీ న్యాప్కిన్లు,కవరింగ్ మెటీరియల్ కవర్లో చుట్టి ప్రత్యేకంగా సూచించిన బుట్టలో వేయాలి.

 

ఘన పదార్థాలను వీధుల్లో వేయొద్దు.కాల్చరాదు.పాతి పెట్టరాదు.

 

ప్రతి వీధి వ్యాపారి చెత్త బుట్టలు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి.

 

నాలుగు రకాల బుట్టలు అందుబాటులో ఉంచుకోవాలి.

 

100 మందికి పైగా హాజరయ్యే కార్య క్రమాలకు లైసెన్స్ లేని ప్రదేశంలో నిర్వహించొద్దు.కనీసం మూడు రోజుల ముందు పంచాయతీకి లేదా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి

 

ఘన వ్యర్థాలను 4 రకాలుగా విభజించి సేకరణ వ్యర్థాల తరలింపు నిబంధనలు కచ్చితంగా పాటించాలి._

 

బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ-2016 ప్రకారం వాటిని ప్రత్యేకంగా ఉంచాలి.మిగతా చెత్తలో కలపరాదు.

 

5వేల చదరపు మీటర్లపైబడిన విస్తీర్ణం లోని గేటెడ్ కమ్యూనిటీలు,సంస్థలు,వసతి గృహాలు,మార్కెట్లు, హోటళ్లు,రెస్టారెంట్లు కచ్చితంగా నిబంధనలు పాటించి చెత్త సేకరణపై తగు జాగ్రతలు తీసుకోవాలి.

 

కుళ్లి పోయే వ్యర్థాలు ఇంట్లోనే కంపోస్ట్ చేయాలి.నిర్మాణ.. చెట్లు,మొక్కల వ్యర్థాలు నిల్వ చేసి అధికారుల సూచన మేరకు తరలించాలి!!_

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram