గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ /పాతబస్తీలో విషాదం మరవకముందే.. అల్వాల్ పరిధిలో రోడ్డుపై తెగిపడిన కరెంట్ తీగలు తగిలి కరెంట్ షాక్తో తండ్రి కూతురు మృతి.
స్థానికులు వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున రోడ్డుపై తెగిపడిన చెట్టు కొమ్మలు తొలగిస్తూ కరెంట్ షాక్తో మృతి చెందిన తండ్రి కూతుళ్లు సందీప్, రితిక .
సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ తీగలు, చెట్లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ తీగలకు సమీపంలో ఉన్న చెట్టు కొమ్మలను స్వయంగా తొలగించే ప్రయత్నం చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








