రూ.10వేలు కడితే రూ.5 లక్షల లోన్..? కొత్త రకం సైబర్ మోసం

ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో వేల రూపాయలు వసూలు.. ఫేక్ లింకులు, నకిలీ యాప్‌లతో 

 

గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్/ అమాయకులను ఆసరా చేసుకొనిరూ.10వేలు కడితే వెంటనే అకౌంట్లో రూ.5 లక్షల లోన్ జమ”, “తక్కువ వడ్డీతో క్షణాల్లో రుణం” అంటూ సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు, ముఖ్యంగా పీఎం ముద్ర లోన్ (PM Mudra Loan) పేరును వాడుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో వేల రూపాయలు వసూలు.. ఫేక్ లింకులు, నకిలీ యాప్‌లతో అమాయకులే టార్గెట్ చేస్తున్నారని ఇలాంటి అందం కాల్స్ ఫేక్ లింక్స్ ఎవరు ఓపెన్ చేయకూడదని. అలాంటి కాల్స్ వస్తే – వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసుల సూచన.

Facebook
WhatsApp
Twitter
Telegram