మూసాపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ /  నగరంలోని మూసాపేట్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఈవీ బ్యాటరీలు, ఇతర పరికరాలు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే అంతటా వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ వద్ద లేదా గోదాంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గోదాంలో నిల్వ ఉన్న ఎలక్ట్రిక్ బైకుల బ్యాటరీలు వరుసగా పేలిపోవడంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చాయి. బ్యాటరీల పేలుళ్లతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో గోదాంలోని అనేక ఎలక్ట్రిక్ బైకులు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram