దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది
రైతులు, మత్స్యకారులు, ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు








