రోడ్డు ప్రమాదంలో నలుగు మృతి

హైదరాబాద్‌కు చెందిన నలుగురు దుర్మరణం..

మాచర్లలో నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాన్ వాహనం

 

గోల్డెన్ న్యూస్ / మాచర్ల /పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నగరవనం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం మాచర్ల నగరవనం వద్దకు చేరుకోగానే రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమై, అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 

మృతులను కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram