గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / శుక్రవారం కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండలం కలవలనాగారం అటవీ ప్రాంతంలోని నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి నాటు సారాకు ఉపయోగించే సుమారుగా 200 లీటర్ల బెల్లం పానకంలో ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా సారా పెట్టినట్లు గమనిస్తే కరకగూడెం పోలీసువారికి సమాచారం అందించాలన్నారు. నాటు సారా తయారీ దారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోబడతాయి అని హెచ్చరించారు.

Post Views: 22








