తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. మొత్తం 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించగా, కీలక విభాగాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.

నియామకాలు ఇలా.

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా శ్వేత నియామకం.

కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా సింధుశర్మ.

సీఐడీ ఎస్పీగా చెన్నూరి రూపేష్.

వికారాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీగా రాజేష్ మీరా.

సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్.

సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వై. సాయిశేఖర్.

సీఐడీలో ఎస్పీలుగా చెన్నూరి రూపేష్, ప్రవీణ్ కుమార్.

గోల్కొండ జోన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి.

ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా చంద్రమోహన్.

ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్ రెడ్డి.

హైడ్రా అదనపు కమిషనర్‌గా ఆనంద్ కుమార్.

ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్ సిద్దిఖీ.

ఈ బదిలీలతో రాష్ట్ర పోలీసు శాఖలో కీలక పోస్టుల్లో కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram