ఉత్తర తెలంగాణకు భారీ – అతి భారీ వర్ష సూచన 

LPA యొక్క పీక్ ప్రభావం – జూలై 3-5

 

ఉత్తర తెలంగాణ ప్రజలారా, ఈ సీజన్‌లో మొదటి ముసురు వానలకు సిద్ధంగా ఉండండి. ఉత్తర తెలంగాణలో వచ్చే రోజుల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు, మొత్తంగా భారీ – అతి భారీ వర్షాలు కురవనున్నాయి

 

గులాబీ రంగులో గుర్తించిన జిల్లాల్లో వచ్చే 3 రోజుల్లో కొన్ని చోట్ల రోజుకు 100-120mm అతి భారీ వర్షాలు కురుస్తాయి.

 

ఎరుపు రంగులో గుర్తించిన జిల్లాల్లో వచ్చే 3 రోజుల్లో రోజుకు 50-80mm భారీ వర్షాలు కురుస్తాయి.

 

నీలం రంగులో గుర్తించిన జిల్లాల్లో 15-45mm మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో 10-15mm తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

 

హైదరాబాద్ – వచ్చే 3 రోజుల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు మేఘావృతంగా ఉండి తేలికపాటి – మోస్తరు వర్షాలు ఉంటాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మేఘావృతంగా ఉండి అక్కడక్కడ చిరుజల్లులు పడతాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram