గోల్డెన్ న్యూస్ / కరకగూడెం/ తుడుందెబ్బ పేరును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పై నిందలు వేయడం ఆరోపణలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.. తుడుందెబ్బ వంటి ఆదివాసీ ఉద్యమ సంస్థ పేరును రాజ కీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఆది వాసీ నాయకుడిగా చెప్పుకుంటూ కాంగ్రెస్ నాయకులపై బురద చల్లడం అత్యంత హేయమైన చర్యగా ఖండిస్తున్నామన్నారు .కులమత వర్గా లకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కా రానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకులపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు చౌలం కేశవ రావు, సర్పంచ్లు కల్తీ విజయ్, పోలేబోయిన సుజాత, కొమరం సుగుణ, తోలెం రమేష్, బాడిష పార్వతి, ఎల్లబోయిన ముత్తమ్మ, ఎర్రం పొట్టయ్య, ఉప సర్పంచ్ గాంధర్ల రామ నాధం, మాజీ ఉప సర్పంచులు కొమరం వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయ కులు సీతారాంబాబు, చందా శ్యాం, సోలం బాబు, తోలెం కృష్ణ, దుర్గం కన్నయ్య, గొగ్గలి కేశవరావు, హనుమంతు పాల్గొన్నారు.









