గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖ కార్యాలయంలో ఇవాళ ఏసీబీ అధికారులు దాడి చేశారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారులు మేగావత్ బాలు, ఎంట్రీ ఆపరేటర్ కోసనోజు వెంకటేశ్వర్ల ను అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ ఫిర్యాదుదారుడు తన బోరుబావి కి అనుమతి కోసం గ్రౌండ్ వాటర్ శాఖను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే అతడికి జరిమానాలు విధించకుండా, రిగ్ను సీజ్ చేయకుండా ఉండేలా చూసేందుకు జిల్లాఅధికారి మేగావత్ బాలు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం మొత్తాన్ని తన ఆఫీసులోని ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లుకు ఇవ్వాల్సిందిగా బాలు సూచించారు.ఈ క్రమంలోనే బాధితుడు నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇవాళ డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లు బాధితుడి నుంచి .20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లంచం సొమ్మును వెంకటేశ్వర్లు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. లంచం డిమాండ్ చేసి, అక్రమంగా డబ్బులు వసూలు చేసినందుకు గానూ నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు









