ఆరోపణలు కాదు.. ఆధారాలుంటే చూపండి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం/  కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసి నాయకుడిని అని చెప్పుకుంటున్న పోలేబోయిన వెంకటనారాయణ తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ఆరోపణలు చేయడం కాదు ఆధారాలతో నిరూపించు. ప్రజల ముందు నిజాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. నిరాధార ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఆయన అన్నారు. నన్ను ఉద్దేశించి మాట్లాడు. మధ్యలో తుడుందెబ్బ పేరును ఎందుకు తీసుకొస్తున్నావు? నేను మాట్లాడింది నీ వ్యక్తిగత వ్యవహారాల గురించి. దానికి తుడుందెబ్బ సంస్థను లాగి రాజకీయాలు చేయడం మానుకో. నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక ఉద్యమ సంస్థ పేరును వాడుకోవడం సరికాదని సూచించారు. నాపై చేసిన ప్రతి ఆరోపణకు ప్రజా కోర్టులో చర్చకు నేను సిద్ధం.  ప్రజా కోర్టులో నిరూపించండి. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగ బండి వెంకటేశ్వర్లు, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, అనంతారం ఉప సర్పంచ్ పూజారి వెంకన్న మండల నాయకులు అత్తే సారయ్య ,షేక్ రఫీ, బిలపాటి సంపత్,జాడి శ్రీను,దుర్గం కన్నయ్య ,జిమ్మిడి నవీన్, పోలేబోయిన పాపారావు, పోలేబోయిన వెంకట్ ,పులి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram