కొండపి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ / ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయాన్నే పెను ప్రమాదం తప్పింది. కొండపి నుంచి సంతనూతలపాడు మీదగా ఒంగోలు వెళ్లే  ఆర్టీసీ బస్సు మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ వద్ద రోడ్డు మలుపులో అదుపుతప్పి ఒక పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 15 మందికి స్వల్ప గాయాలు కాగా కండక్టర్కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram