పోలవరం జిల్లా లో తీవ్ర విషాదం
గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ /గోదావరి లో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయిన ఐదుగురు గిరిజనులు మృతి మృతదేహాల వెలికితీత మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఏటపాక మండలం గొల్లగూడెం వద్ద ఈ ఘటన జరిగింది
ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన రమేష్ ఊకె (38), భారతి తుర్రం (40), లక్ష్మి ఉయిక (37), ఉయిక సుశీల (37), బాలరాజు బసిపోయిన (40)గా గుర్తించారు. ఐదుగురు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు.ఈ ఘటనతో గొమ్ము కొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ప్రజలు వర్షాకాలంలో చేపల వేట లేదా ఇతర అవసరాల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.









