ఆదివాసీలకు దుస్తులు, సోలార్ లైట్లు పంపిణీ

రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీలకు దుస్తులు, సోలార్ లైట్లు పంపిణీ

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / మండలంలోని వలస ఆదివాసి గ్రామాలైన నీలాద్రి పేట గండి, అశ్వాపురంపాడు గ్రామాల్లోని 70 ఆదివాసి కుటుంబాలకు రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో సోలార్ లైట్లు, చీరలు, 70 కుటుంబాలకు నిత్యవసర సరుకులు, ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్సై పి వి ఎన్ రావు సమక్షంలో అందజేశారు…. ఈ సందర్భంగా సిఐ,ఎస్ఐ మాట్లాడారు… వలస ఆదివాసీలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి గుర్తింపుతో ఎదగాలని వారు అన్నారు. వలస ఆదివాసీలు తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. అనంతరం రాబిన్ హుడ్ ఆర్మీ సేవలను కొనియాడారు..

Facebook
WhatsApp
Twitter
Telegram