గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం- ఇల్లందు బొమ్మనపల్లి క్రాస్ మధ్య లోతువాగు గ్రామం వద్ద జాతీయ రహదారి (ఎన్‌హెచ్-930పీ)పై ఉన్న ఓవర్‌బ్రిడ్జికి చేపట్టిన మరమ్మతు పనులు పూర్తయ్యాయని, ఈ నేపథ్యంలో అమలులో ఉన్న ట్రాఫిక్ డైవర్షన్‌ను జూలై 22 ఉదయం 8 గంటల నుంచి ఎత్తివేస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. రేపటి ఉదయం నుంచి వాహనాలు యథావిధిగా ఓవర్‌బ్రిడ్జిపై రాకపోకలు సాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మరమ్మతు పనులు సజావుగా పూర్తయ్యాయని, భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు. ట్రాఫిక్‌కు అంత రాయం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో మరమ్మతు పనులను విజయవంతంగా పూర్తి చేయడంపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, పోలీసు అధికారులను అభినందించారు.









