ఎట్టకేలకు పాఠశాలలో మూత్రశాలలు తెరిపించిన అధికారులు అధికారులు అధికారులు.
గోల్డెన్ న్యూస్ /పినపాక/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పెంటన్నగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నట్లు విద్యార్థులు ఒక వీడియో రిలీజ్ చేశారు. విషయం తెలుసుకొని “ఒంటికి.. రెంటికి.. బయటకు వెళ్లాల్సిందే!” అనే శీర్షికను గోల్డెన్ న్యూస్ బుధవారం ప్రచురించింది. తక్షణమే స్పందించిన కలెక్టర్ అంకిత్ విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలని పినపాక తహసిల్దార్ శ్రీనివాసరెడ్డిి కి ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి దిగిన తాసిల్దార్ పాఠశాలను పరిశీలించి సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి మూత్రశాలను తెరిపించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Post Views: 442









