కానిస్టేబుల్ స్వామి తుపాకీ తో కాల్చుకొని ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ //హైదరాబాద్// తెలంగాణ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో వాష్ రూమ్కు వెళ్లిన స్వామి అక్కడే కాల్చుకొన్నాడు. తన భార్య, పిల్లలను ఏమీ అనవద్దని రాసివున్న సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. కాగా, కుటుంబ కలహాలతోనే స్వామి ఆత్మహత్య చేసుకొన్నట్లు భావిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram