ఇన్స్టాగ్రామ్లో మరింత చురుకుగా ఉండాలని, యువతతో అనుసంధానం కావడానికి ఆ వేదికను ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం క్యాబినెట్ భేటీ సందర్భంగా.. మంత్రుల్లో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లను చురుకుగా ఉపయోగిస్తున్నారని ప్రధాని అడిగినట్లు సమాచారం. దేశంలోని యువతలో అధిక భాగం వీటిపై సమయం వెచ్చిస్తున్నారని.. వారితో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇన్స్టాలో యాక్టివ్గా ఉండాలని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది.
Post Views: 19









