గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్మాంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు. అందుకే నిరసనను వీరమిస్తున్నామన్నారు.
విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరిన CJP చీఫ్ స్పోక్ పర్సన్ సౌరవ్ దాస్
Post Views: 24









