డాక్టర్ అవతారమెత్తిన మెడికల్ షాప్ యజమాని

విచ్చలవిడిగా మందుల అమ్మకాలు

పేద మధ్యతరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటం

పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ

నామమాత్రంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు

 

గోల్డెన్ న్యూస్ /మియపూర్ / మదినాగుడా డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్ బాలాజీ క్లినిక్ మెడికల్ షాపు యజమానులే డాక్టర్ గా చలామణి అవుతున్నారు. వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలకు వాంతులు, విరోచనాలు, జ్వరాలు రావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న క్లినిక్ లకు వెళ్లి వారి సమస్యను పరిష్కరించుకుంటారు. కురుస్తున్న వర్షాలకు చిత్ర విచిత్రమైన రోగాలు రావడంతో కొంతమంది మెడికల్ షాపు యజమానులే డాక్టర్లుగా పేషెంట్లను చూస్తూ, ఇంజక్షన్లు ఇస్తూ, డాక్టర్లుగా చెలామని

 

పేద మధ్యతరగతి ప్రజలే వీరి లక్ష్యం

పేద మధ్యతరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మెడికల్ షాపు యజమానులే ఈ విచ్చలవిడి విక్రయాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్ ల తనిఖీల లేమి లేకపోవడంతో మెడికల్ షాపు యజమానులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా రెచ్చిపోతున్నారు. మెడికల్ మాఫియా రోజురోజుకు హద్దులు దాటి డాక్టర్ పిక్సెప్షన్ లేకుండానే మెడికల్ షాప్ ఓనర్స్ వైద్యం చేస్తున్నారు. విచ్చలవిడిగా యాంటీబయోటిక్, అలాగే శాంపుల్స్ తో భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

 

పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ…

 

ఫార్మసీ చట్టం ప్రకారం 1948 సెక్షన్ 42 ప్రకారం రిజిస్టర్ ఫార్మసిస్ట్ తప్ప మరో వ్యక్తి మందులు అమ్మకూడదు, పంపిణీ చేయకూడదు, ఎలాంటి అర్హత లేని వ్యక్తులు  మెడికల్ షాప్ తీసిన వైద్యం చేసిన ఆరు నెలల జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండు విధిస్తారు. ఈ విషయం తెలిసిన కూడా 50% శాతం మెడికల్ షాపుల్లో అర్హత కలిగిన ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మెడికల్ షాప్ ఒకరిది సర్టిఫికెట్లు మరొకరివి పేట్టి చలామని చేస్తున్నారు

 

ఈ మెడికల్ షాపులలో అర్హతలేని వ్యక్తులు పనిచేయటం వలన ఇష్టం వచ్చిన మందులను ఇచ్చి అధిక లాభాలను నడుస్తున్నారు. మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మందుల షాపుల యజమానులు వ్యాపారం కొనసాగిస్తున్నారు.

 

నామమాత్రంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు…

 

పిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా మాత్రలు అమ్ముతున్న వారిపై డ్రగ్ ఇన్స్పైక్టర్ లు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మందుల దుకాణాలలో డాక్టర్లు ఇచ్చే నమూనా జనరిక్ మందులను కూడా ఎక్కువ ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. నకిలీలు క్లినిక్ లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇవన్నీ నియంత్రించాలంటే  వైద్య ఆరోగ్యశాఖ ఉన్న తాధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా వెంటనే తనిఖీలు చేపట్టి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram