నేటితో ముగియనున్న అంగన్వాడీ టీచర్ల సర్టిఫికెట్లు పరిశీలన

గోల్డెన్ న్యూస్ / మణుగూరు/ అంగన్వాడీ టీచర్ల సర్టిఫికెట్ల వేరిఫికేషన్ నేటితో ముగియనున్నట్లు సిడిపిఓ జయలక్ష్మి తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగానికి ఆన్లైన్ చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్లు సకాలంలో వేరిఫికేషన్ చేయించుకోవాలని ఆమె కోరారు. ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు, జిరాక్స్ కాఫీలపై గెజిటెడ్ సంతకాలు చేయించుకొని పట్టణ కేంద్రంలోని శ్రీశ్రీ నగర్ కాలనీలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టు మణుగూరు కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరూ నేడు చివరి తేదీ ఉన్నందున అందరూ పని వేళల్లో కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆమె కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram