కరకగూడెం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

⇒ బాధితులతో గౌరవంగా వ్యవహరించి తక్షణ పరిష్కారం చేయాలి

⇒ సిబ్బంది నీతి, నిజాయితీతో బాధ్యతయుతంగా తమ విధులను నిర్వర్తించాలి

⇒  డీఎస్పీ రవీందర్ రెడ్డి.

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్టేషన్ ను వార్షిక తనిఖీలలో భాగంగా మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా పలు రికార్డులను, సీసీటీవీ ల పనితీరును పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందిని నీతి నిజాయితీ తో పనిచేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని  సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఏడుల్ల బయ్యారం వి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు..

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram