గోల్డెన్ న్యూస్ //హైదరాబాద్// రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది.
రానున్న 2 గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదేవిధంగా ఈ వర్షాలు యాదాద్రి – భువనగిరి, జనగాం, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు జిల్లాలకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విస్తరిస్తాయి. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ అధికారులు రాబోయే గంటల్లో మరిన్ని అప్‌డేట్‌లు ఇస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
Post Views: 21









