మహిళను లైంగికంగా వేధించిన మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ను వెంటనే అరెస్టు చేయాలి..మండల మహిళా కాంగ్రెస్ సర్పంచ్ లు మరియు నాయకులు..
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల మహిళా కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్లు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం అత్యంత బాధాకరం అన్నారు. మహిళ చేసిన ఫిర్యాదుపై పోలీసులు నమోదు చేసిన కేసును పూర్తిస్థాయిలో విచారించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటం మహిళా సమాజానికే అవమానమని పేర్కొన్నారు. మహిళల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లేదని విమర్శించారు..
మహిళల ఓట్లతో గెలిచి ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మహిళల గౌరవాన్ని కాపాడాల్సింది పోయి, ఈ విధంగా చేయటం సిగ్గుచేటు అని అన్నారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మహిళల గౌరవాన్ని కించపరిచే వారిని మహిళా సమాజం ఎప్పటికీ సహించదని, భవిష్యత్తులో ఇటువంటి నాయకులకు మహిళలే ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా నైతిక బాధ్యత వహించి వెంటనే రేగ కాంతారావుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో మండల మహిళా మాజీ అధ్యక్షురాలు చందా రత్నమ్మ, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, చిరుమల్ల సర్పంచ్ కొమరం సుగుణ, గొల్లగూడెం సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ, చొప్పాల సర్పంచ్ తొలేం సావిత్రి, మండల మహిళా నాయకులు పూణెం శ్యాం కుమారీ, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..








