రేగా కాంతారావుపై నమోదైన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం.

⇒ రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు.

⇒ మహిళలను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి.

⇒ మా నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేస్తే గట్టిగా సమాధానం ఇస్తాం.

⇒ కాంగ్రెస్ నాయకులు హద్దులు దాటి మాట్లాడితే తాటతీస్తాం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమయ్య 

 

గోల్డెన్ న్యూస్ //కరకగూడెం// భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పై నమోదైన వేధింపుల కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య తెలిపారు. సోమవారం కరకగూడెం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…తమ నాయకుడిని రాజకీయంగా దెబ్బతీసేందుకు అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

రేగా కాంతారావుపై నమోదైన కేసుకు ఎలాంటి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేకపోయినా,కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ బీఆర్ఎస్ పార్టీని,తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.అమాయక ఆదివాసీ మహిళా సర్పంచులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం,ప్రజల్లో అపోహలు సృష్టించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని అన్నారు.

ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల అసలు స్వరూపం బాగా తెలుసని,అవినీతి,అక్రమాలు,సెటిల్‌మెంట్లు ఇసుక దందాలు,అధికార దుర్వినియోగం వంటి అంశాలపై ప్రజలు ఇప్పటికే అవగాహనతో ఉన్నారని పేర్కొన్నారు.ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులు వాటిని పక్కనబెట్టి ప్రతిపక్ష నాయకులపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.15 రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నాయకుల వ్యవహారాలు,అవినీతి ఆరోపణలపై తాము బహిరంగంగా ప్రశ్నించిన విషయాన్ని ఇప్పుడు మర్చిపోయారా? అని రావుల సోమయ్య ప్రశ్నించారు.ఆ రోజు లేవనెత్తిన ఒక్క ప్రశ్నకైనా ఇప్పటివరకు సమాధానం ఇవ్వకుండా,ఇప్పుడు తమ నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం,తప్పుడు ఆరోపణలు చేయడం వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.

రాజకీయాల్లోకి రాకముందు ఎవరి పరిస్థితి ఎలా ఉండేదో,అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో ప్రజలందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.తమ నాయకుడిపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ,వ్యక్తిత్వ హననానికి పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.అత్యుత్సాహంతో హద్దులు దాటి మాట్లాడితే తగిన సమయంలో,తగిన విధంగా రాజకీయంగానూ,చట్టపరంగానూ సమాధానం ఇస్తామని హెచ్చరించారు.మహిళలను రాజకీయాలకు వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని,వారి పేర్లతో అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.రాజకీయాల్లో హుందాతనం పాటించాలని,వ్యక్తిగత దూషణలు,నిరాధార ఆరోపణలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.రేగా కాంతారావుపై నమోదైన కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని,న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని ఆయన సూచించారు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడరని,పార్టీ నాయకత్వానికి అండగా నిలుస్తూ ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పోగు వెంకటేశ్వర్లు,బైరిశెట్టి చిరంజీవి,సర్పంచులు కొమరం సత్యనారాయణ,వట్ట సందీప్,రేగా సత్యనారాయణ,అత్తె సత్యనారాయణ,నిట్టా ఏడుకొండలు,యల్లు రామకృష్ణారెడ్డి,కటకం లెనిల్,జాడి నాగరాజు,కొమరం విశ్వనాథం,పాయం క్రిష్ణ,పాయం నర్సింహారావు, కటకం లెనిన్,పాయం కృష్ణ,గాందర్ల సతీష్, ప్రశాంత్,రాంబాబు,శ్రీను, యాకూబ్ పాషా,వేణు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram