గోల్డెన్ న్యూస్ //తెలంగాణ // ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇకపై చిరగని, తడవని నాన్ టియరబుల్ మెమోలు అందనున్నాయి. ఈ ఏడాది నుంచే ఈ కొత్త సాంకేతికతతో కూడిన మెమోలను అందించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. సుమారు 4 లక్షల మంది సెకండియర్ పాసైన విద్యార్థులకు ఆగస్టు 15లోగా వీటిని పంపిణీ చేయాలని బోర్డు చర్యలు చేపడుతోంది. గతంలో వర్షాలు, వరదల వల్ల మెమోలు పాడైపోవడం, విద్యార్థులు ఇబ్బందులు పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, మెమోలపై విద్యార్థుల కలర్ ఫొటోలను ముద్రించడం ద్వారా నకిలీ సర్టిఫికెట్లను అరికట్టాలని బోర్డు భావిస్తోంది.
Post Views: 14








