గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

మృతుడు వెంకటాపురం గ్రామ వాసి.

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కరకగూడెం గ్రామంలో ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి 10.5గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో వెంకటాపురం గ్రామానికి చెందిన కొమరం రాంగోపాల్ (20)  మృతిచెందాడు. మృతుడు స్నేహితుడు కలిసి ద్విచక్రవాహనంపై కరకగూడెం లోని పెట్రోల్ పంపు  నుండి డీజిల్ తీసుకొని  స్వగ్రామమైన వెంకటాపురం వెళ్తున్న క్రమంలో సీతారాంపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో స్థానికులు 108 వాహనంలో భద్రాచలం తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందడు సంఘటనా స్థలాన్ని ఎస్సై పివి నాగేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram