తెలంగాణలో డయల్ 112 సేవలు ప్రారంభం

పోలీస్, ఫైర్, అంబులెన్స్ కు ఇకఒక్కటే నంబర్  సేవలను ప్రారంభించిన డిజిపి సివి ఆనంద్

 

గోల్డ్ న్యూస్ /వెబ్ డెస్క్ / డయల్ 112 ద్వారా 18 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని డిజిపి సీవీ ఆనంద్ వెల్లడించారు. న్యాయసాయం, వైద్యసాయం, సైబర్పాయం అనేక సమస్యల పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గమని వ్యాఖ్యానించారు. డయల్ 112కు ఫోన్ చేసినప్పుడు పోలీసులు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకే వ్యవస్థలోకి పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలు, టిజిఐసిస్తీ నుంచి డయల్ 112 సేవలను పర్యవేక్షి స్తామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, అత్యవసర స్పందన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. డయల్ 112 ఫోన్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ ఆల్స్ వాడుతున్నామని పేర్కొన్నారు. డ్రోన్ బెస్ట్ టెక్నికల్ సిస్టంను త్వరలోనే తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తారని వివరించారు. డ్రోన్ టీమ్ను సైతం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. డయల్ 112 అనేది 3.0 వర్షన్ ఉంటుందని తెలిపారు. యువ ఏపీఎస్లు, ఏఐ టెక్నాలజీ వాడే వారిని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. బేసిక్ పోలీసింగ్ బాగా టెక్నాలజీ పోలీసింగ్ను అమల్లోకి తీసుకువస్తున్నా మని వ్యాఖ్యానించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram