ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.
గోల్డెన్ న్యూస్ /గద్వాల/ నాలుగు రోజుల క్రితం ప్రసాద్ ఆదిత్య మాల్ లో దుండగుల పైశాచితత్వానికి గురైన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక నిశ్చల స్థితిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది రెండు రోజుల క్రితమే ఆమెను బ్రెయిన్ గెట్ గా డాక్టర్లు ప్రకటించారు. కాగా ఆదివారం మధ్యాహ్నం 3.22 గంటలకు ఆమె మరణాన్ని సికింద్రాబాద్ ని చిమ్స్ వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు. గత సోమవా రాత్రి సినిమా చూసి వస్తున్న డాక్టర్ ప్రియాంక స్కూటీని వెనుక నుంచి ఇద్దరు దుండగులు తమ కారుతో పదేపదే గుద్దారు ఆమె నేలపై పడటంతో ఆమె గొంతు పైనుంచి కారును పోనిచ్చారు ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు ఆమెతోపాటు స్కూటీపై ఉన్న స్నేహితుడు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు . ప్రస్తుతం డాక్టర్ ప్రియాంక రాజానగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చేస్తున్నారు తీవ్ర గాయాలపై పాలైన ఆమెను తోలుత స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి. పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసరమైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు. అప్పటినుంచి ఆమె హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే చికిత్సకు ఆమె శరీరం సహకరించడం లేదు. దీంతో ఆమె మృతి చెందారు ప్రియాంక స్వగ్రామం గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పూర్ గ్రామం..









