గోల్డెన్ న్యూస్/ కొణిజర్ల / ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన హేమశ్రీ (14) జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో తండ్రి స్థానిక ఆర్ఎంపీ చల్లా రమేష్ వద్దకు తీసుకెళ్లాడు. ఆర్ఎంపీ బాలికకు ఇంజెక్షన్ ఇవ్వడంతో పరిస్థితి విషమించి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆర్ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Post Views: 36









