ఈ నెల 17 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో తనిఖీలు
గోల్డెన్ న్యూస్ /తెలంగాణ / ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, వసతులపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ నెల 17వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహించేందుకు 307 అకడమిక్ ప్యానెల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు విద్యార్థులకు బోధన, హాజరు, పారిశుధ్యం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు వంటి అంశాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తాయి. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Post Views: 25








