రేపు రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల బంద్  

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / నల్గొండ జిల్లాలోని నాగార్జున ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యపై తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రేపు ఆప్షనల్ హాలిడే ఉంది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram