హత్యాయత్నం కేసు.. చేధించిన పోలీసులు

నలుగురు వ్యక్తుల అరెస్టు

ఇటీవల జరిగిన అత్యాయత్నం కేసును పోలీసులు చేధించి నిందితులను అరెస్టు చేశామని  ఏడూళ్ళబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

 

కరకగూడెం : ఈనెల 19.09.2026న అశ్వాపురంపాడు గ్రామ శివారులో ఉన్న ఫారెస్ట్ ప్లాంటేషన్ వద్ద అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన వజ్జా భీమరాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి మెడ పైన తల పైన విచక్షణారహితంగా గాయపరిచిన వ్యక్తులను ఈ రోజున (మంగళవారం) అదుపులోకి  తీసుకున్నారు . పోలీసుల అదుపులో ఉన్న వారి పేర్లు  కోవాసి బాలకృష్ణ, పోడియం విజయ, కోవాసి సంతోష్ , పోడియం మంగయ్య ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అయితే నలుగురు వ్యక్తులు గతంలో వాళ్ల ఊరు పెద్దమనిషి అయినా వెంకటేశ్వర్లు మొదటి ముద్దాయి వాళ్ల నాన్న హత్యకు గురయ్యాడు అతన్ని చంపిన వ్యక్తి భీమరాజు అని జైలు నుంచి విడుదల కాగానే ఈ నలుగురు మాట్లాడుకుని అతనిని  పశువుల మేపటానికి అటవీకి వెళ్లగా అతని వెంబడించి కత్తులతో నరికి అక్కడ నుంచి పారిపోయారు. నేరస్తులను  కరకగూడెం పోలీసులు పట్టుకొని వారిని రిమాండ్ కి తరలించినట్లు ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్సై టీవీ నాగేశ్వరరావు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram