ఆళ్లపల్లి : ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి కింద పడి గీత కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని మర్కోడు గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్కోడు గ్రామానికి చెందిన గీత కార్మికుడు కోతి యాదగిరి తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Post Views: 327








