నూతన ఎస్సై రఘును కలిసిన వర్తక సంఘం నాయకులు

పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారం పోలీస్‌ స్టేషన్‌ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రఘును పినపాక మండలం బయ్యారం క్రాస్‌రోడ్‌ వర్తక సంఘం అధ్యక్షుడు గుండు సురేష్‌, భాస్కర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై రఘుకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్భంగా వర్తక సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ శాఖకు వ్యాపారుల తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. వ్యాపార ప్రాంతాల్లో ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram