క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్

గోల్డెన్ న్యూస్/ మెదక్: వంద ఏళ్ల ఘన చరిత్ర కలిగిన మెదక్ చర్చిని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం సందర్శించారు. మొదట మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ను సందర్శించారు కలెక్టరేట్కు వచ్చిన గవర్నర్ కు కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమా ర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

అక్కడి నుంచి మెదక్ చర్చిని సందర్శించిన గవర్నర్ ను ప్రెస్ బ్రీటరీ ఇంచార్జ్ శాంతయ్య, చర్చి కమిటీ సభ్యులు పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.

చర్చి విఐపి రిజిష్టర్ లో సంతకం పెట్టిన గవర్నర్, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా చర్చి గురువులు గవర్నర్ ను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీవో రమాదేవి, ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, చర్చి సభ్యులు గంట సంపత్, శాంసన్ సందీప్, జాయ్ ముర్రే తదితరులు ఉన్నారు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram