గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్ : మునిసిపాలిటీ పరిధిలోని డైరీ ఫారం వద్ద గ్యాస్ సిలిండర్ల లోడు లారీ బోల్తా పడింది.స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాదు నుండి నిండు గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ కు ఆరోగ్య సమస్య ఏర్పడటంతో, లారీ అదుపు తప్పి ప్రధాన రహదారి వెంట ఉన్న డైరీ ఫారం గల ఉన్న చిన్న కాలువలో బోల్తా పడింది.
గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, డ్రైవర్ ను లారీ నుండి బయటకు తీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిలిండర్లు నిండుగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా పెద్ద ప్రమాదమే తప్పింది అని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీస్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 67









