ఆ రహదారిపై 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న గేట్లు

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 25 ఏళ్ల తర్వాత

ఆ జాతీయ రహదారిపై తెరుచుకున్న గేట్లు.

గోల్డెన్ న్యూస్ /ములుగు : – ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్ ఐపిఎస్ ఆదేశాల తో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆధ్వర్యంలో  అన్ని విధాలుగ  భద్రత చర్యల నడుమ NH 163 జాతియ రహదారినీ శనివారం ఉదయం ఏటూరు నాగారం పోలీసు  ఆధ్వర్యంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ ,ఎస్ఐ తాజుద్దీన్ రోడ్డు మార్గం గేట్లు  తొలగించారు .ఈ నీ మేరకు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ మాట్లాడుతూ… 2001 సంవత్సరంంలో నక్సల్స్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. ఆనాటి ఎస్సై, ప్రస్తుత నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు, అప్పటి నుండి నేటి వరకు భద్రత చర్యలలో భాగంగా రోడ్డు మార్గం గేట్లు మూసివేసి దారి వల్లించారు.  రోడ్డు మార్గం దాదాపు 25 ఏండ్ల తరువాత తిరిగి ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం కోసం అభివృద్ధి లో భాగంగా తిరిగి శనివారం NH 163 జాతీయ రహదారిపై గేట్లు ఎత్తివేసి పునర్ ప్రారంభించారు.జాతీయ రహదారిపై మూసివేసిన గేట్లు ఎత్తివేయడం తొ ప్రజలు వాహనదారులు. పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..

 

Facebook
WhatsApp
Twitter
Telegram