పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి నెలవంక కనిపించింది. సౌదీ అరేబియాలో శనివారమే దీక్షలు ప్రారంభంకావడంతో, ఆదివారం నుంచి మన దేశంలో దీక్షలు చేపట్టారు..
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం :
సాంస్కృతికం: పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి నెలవంక కనిపించింది. సౌదీ అరేబియాలో శనివారమే దీక్షలు ప్రారంభంకావడంతో, మన దేశంలో సోమవారం నుంచి దీక్షలు చేపట్టడం ఆనవాయితీ.
రంజాన్ మాసం వచ్చిదంటే ముస్లిం వర్గాలు చేసే ఉపవాస దీక్షలు, దాతృత్వం, ప్రార్థనలు, నిత్య ఖురాన్ పఠనం, ఇఫ్తార్ విందులతో సమాజంలో మత సామరస్యం వెల్లివిరిసేలా చేస్తాయి.ఈ మాసం మనిషి సత్ప్రవర్తన దిశలో సాగడానికి, మార్గాన్ని సుగమం చేస్తుందని భావిస్తారు..
ఇప్పటికే మసీదులను ముస్తాబు చేశారు. దీక్షలు విరమణ సమయంలో ఆహారాలు అందించే స్టాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ మాసంలో ప్రత్యేక ఆకర్షణ.. హలీమ్, హర్రీస్ లాంటి వంటకాలకు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే ముస్లిం సామాజిక కుటుంబాలు ఉపవాస దీక్షలతో నెల రోజులు దైవారాధనలో గడిపేందుకు సంసిద్ధమయ్యాయి.
♦ ఇస్లామియా క్యాలెండర్లో తొమ్మిదో నెల రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందుకు కారణం ‘దివ్యఖురాన్’ గ్రంథం ఈ మాసంలోనే ఆవిర్భవంచడం. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం.
♦ ఈ మాసంలో రోజుకు అయిదుసార్లు నమాజ్తోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వయసుతో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం భక్తిశ్రద్ధలతో దీక్షలు చేపడతారు. జకాత్తోపాటు ఫిత్రా దానానికి రంజాన్లో ఎంతో ప్రాధాన్యముంది. మూడు పూటలా తిండికి, ఒంటి నిండా దుస్తులకు నోచుకొని అభాగ్యులకు సంపన్నులైన ముస్లింలు దానం చేయాలని ఇస్లాం బోధిస్తోంది.
♦ ఈ మాసం మనిషి సత్ప్రవర్తన దిశలో సాగడానికి, మార్గాన్ని సుగమం చేస్తుందని భావిస్తారు. ఇప్పటికే మసీదులను ముస్తాబు చేశారు. దీక్షలు విరమణ సమయంలో ఆహారాలు అందించే స్టాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ మాసంలో ప్రత్యేక ఆకర్షణ.. హలీమ్, హరీస్ లాంటి వంటకాలకు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.









