రిటైర్డ్ ఎస్ఐ ఆత్మహత్య.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రికొత్తగూడెం : మనస్థాపంతో  రిటైర్డ్ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన  ఘటన న్యూ గొల్లగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల  వివరాల ప్రకారం.. న్యూగొల్లగూడెంకు చెందిన రిటైర్డ్ ఎస్సై షేక్ ఖాజా మొహినుద్దిన్ నాలుగు నెలల కిత్రం కొత్తగూడెం 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగ విరమణకు అనంతరం ఆయనకు చెందిన ప్రతిఫలాలు పూర్తిగా అందలేదు. ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారడంతో తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. మానసిక వేదన తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ పలువురు సీఐలు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram