ఎంసెట్: నిమిషం ఆలస్యమైంది, అనుమతించలేదు

గోల్డెన్ న్యూస్/ మేడ్చల్ : తెలంగాణలో  మంగళవారం జరిగిన టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET) పరీక్షా సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు కారణమైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన స్పందన అనే యువతికి ఒక్క నిమిషం ఆలస్యం కారణంగా పరీక్షకు దించని అధికారులు.

స్పందన టీఎస్ ఈఏపీసెట్ పరీక్ష రాయడానికి మేడ్చల్ జిల్లాలోని శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకే పరీక్షా కేంద్రానికి రావాల్సిన నిబంధన ఉండగా, ఆమె 3:01కు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. కాలేజీ అడ్రెస్ సరిగ్గా తెలియక, మధ్యలో ఇతరులను అడుగుతూ రావడంతో తాను ఒక నిమిషం ఆలస్యం అయినట్టు తెలిపారు.గేటు లోపలికి సరైన సమయానికే వచ్చా, కానీ అబ్జర్వర్ మాత్రం ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చారు. అయినా కూడా వారు నన్ను పరీక్ష రాయనివ్వలేదు. కాళ్లు పట్టుకొని వేడుకున్నా కన్కటించలేదని స్పందన కన్నీటి పర్యంతమయ్యారు.తన కూతురు ఏడాది కాలం కష్టపడి చదివి, పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైందని కారణంగా అవకాశం కోల్పోవడం స్పందన తండ్రి తీవ్ర ఆవేదన కు లోనయ్యారు.నిబంధనలు సరైనవే కానీ పరీక్షా కేంద్రానికి మా ఊరు 150 కిలోమీటర్ల దూరం పరీక్ష కేంద్రం అడ్రస్ తెలియక వెతకడంలో సమయం దాటిపోయినది. సమయానికి ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయాము. ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు అధికారులు అనుమతించలేదని బాధగా ఉందన్నారు.

ఈ ఘటన విద్యార్థుల్లో  అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కఠిన నిబంధనల పేరుతో కనీస మానవతా దృష్టి లేకుండా విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు న్యాయమని నిబంధనలు సరైనప్పటికీ ఒక్క నిమిషం ఆలస్యానికి శిక్షగా ఏడాది జీవితాన్ని కోల్పోవడం బాధాకరమైన విషయమని పలువురు ఆవేదన వ్యక్తం చస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram